నల్లాల లక్ష్మి రాజం మృతి పట్ల సాహితీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: కరీంనగర్ జిల్లా నుండి ఎదిగిన ప్రముఖ రచయిత, దళిత సాహితీవేత్త నల్లాల లక్ష్మి రాజం అకాల మరణం పట్ల సాహితీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ప్రముఖ రచయిత బి.ఎస్. రాములు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ఇది సాహిత్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.కథా రచయితగా, నాటకకర్తగా, పాటల కవిగా నల్లాల లక్ష్మి రాజం విశిష్ట స్థానం సంపాదించారు. ఆయన రచించిన “తిరుగు ప్రయాణం” కథల సంపుటి విశేష ఆదరణ పొందడంతో పాటు విశాల సాహిత్య అకాడమీ పురస్కారాన్ని...