navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 8:35 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నవోదయలో సీటు సాధించిన విద్యార్థిని సాన్వికి సన్మానం

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం ధామరాజ్‌పల్లి గ్రామంలోని కేరళ హైస్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న భుక్య సాన్వి జవహర్ నవోదయ విద్యాలయం లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశానికి గాను సీటు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అనిల్ సింగ్, ఉపాధ్యాయులు సాన్విని సన్మానించి అభినందించారు. కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చినందుకు ఆమెను ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీస్సులు తెలిపారు.