navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 4:21 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నాణ్యత విషయంలో రాజీ పడొద్దు..

పైలెట్ ప్రాజెక్టుగా మహిళా సంఘాలకు భవనాలు..

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

నవగీతం, జగిత్యాల/బుగ్గారం:

ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఏలాంటి రాజీ పడవద్దని అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం బుగ్గారం మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.బుగ్గారంలో రూ.25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు, రూ.10 లక్షలతో నిర్మించే మహిళా సంఘాల వీవో భవనానికి శంకుస్థాపన చేశారు. మండలంలోని వెల్గొండ గ్రామంలో రూ. 5 లక్షలతో చేపట్టి డ్రైనేజీ పనులు, రూ. 15 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం నిర్మించే నిర్మాణాలలో నాణ్యత లో ఏలాంటి రాజీ లేకుండా కాంట్రాక్టర్ ద్వారా పని చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. భవన నిర్మాణాలు సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో మహిళా సంఘాలకు కావలసిన వీవో భవనాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. వీవో భవనాల్లో కావలసిన మౌలిక సదుపాయాలకు అవసరమైతే అదనపు నిధులు ఇస్తామని మంత్రి  తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన మంత్రి..

బుగ్గారం మండల కేంద్రంలో నక్క లక్ష్మికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కలలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని మంత్రి అన్నారు. నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల ను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి అన్నారు.వెలుగొండ గ్రామ పర్యటన కు వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎదురుగా వచ్చిన దివ్యాంగుడు శాఖ పురం శ్రీనివాస్ తో  మంత్రి మాట్లాడారు.. కొత్త ట్రై సైకిల్ ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. శ్రీనివాస కు పెన్షన్ వస్తున్న విషయంపై ఆరాతీసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంటనే వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.