navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 1:53 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నాణ్యమైన సరుకులు అందిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి

నటరాజ్ కిరాణా, సరుకుల దుకాణం ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

మెట్‌పల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నటరాజ్ కిరాణా, సాధారణ సరుకుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెట్‌పల్లి పట్టణ పురపాలక సంఘం అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దుకాణాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు పాల్గొని దుకాణ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపార రంగంలో ముందుకు రావాలనే ఉత్సాహం యువతలో పెరుగుతుండడం ఆనందదాయకమని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన సరుకులు అందిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం దుకాణ యజమానులను అందరూ అభినందించారు.