“నాన్న” అని పిలవలేని బాల్యం
గణపతి కుమారుడి భావోద్వేగ గాధ (కాలాగిరి శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ జర్నలిస్ట్,సెల్.9010128884) ఒక విప్లవం వెనుక సిద్ధాంతాలు ఉంటాయి. ఒక ఉద్యమం వెనుక రాజకీయ లక్ష్యాలు ఉంటాయి. కానీ ఆ ఉద్యమాల నీడలో కొన్నిసార్లు మనిషి జీవితంలోని అత్యంత మృదువైన భావోద్వేగాలు.. కుటుంబం, తండ్రి, తల్లి, పిల్లల మధ్య బంధం.. నిశ్శబ్దంగా బలి అవుతాయి. మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కుమారుడు ముప్పాల శ్రీనివాసరావు విడుదల చేసిన ఈ భావోద్వేగపూరిత సందేశం ఆ నిజాన్ని మరోసారి మన కళ్లముందు నిలబెడుతోంది. గణపతి కుమారుడు భావాలను...