navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 6:31 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నేటితో ముగియనున్న జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు

నవగీతం, కరీంనగర్:

జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు గడువు నేటితో ముగియ నున్నట్లు పార్టీ కరీంనగర్ నాయకులు కాస రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా సభ్యత్వం తీసుకునేవారు, ఇప్పటికే సభ్యత్వం ఉన్న వారు రెన్యువల్ చేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ ఉద్యమి సభ్యత్వంతో పాటు కార్యక ర్తలకు భీమా సౌకర్యాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.5 లక్షలు, రెండు కాళ్లు లేదా రెండు చేతులు కోల్పోతే రూ.5 లక్షలు, ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోతే రూ.2.5 లక్షలు, పూర్ణ వైకల్యం కలిగినా రూ.5 లక్షల భీమా వర్తిస్తుందని తెలిపారు. వార్షిక సభ్యత్వ రుసుము రూ.400 మాత్రమేనని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కోసం పేరు, ఫోటో, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు వివరాలను సూచించిన సెల్: 8978113833 నంబరు పంపాలని సూచించారు కరీంనగర్ నియోజకవర్గంలో కార్యకర్తలు, పవన్ అభిమానులు అధిక సంఖ్యలో ఉద్యమి సభ్యత్వం తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని కోరార