navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 7:26 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పట్టణంలోని 25వ వార్డులో అక్షరాస్యతకు కొత్త వెలుగు

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

మెట్‌పల్లి పట్టణంలోని 25వ వార్డులో ఆదివారం నవభారత సాక్షరత కార్యక్రమం ఉల్లాస్ ద్వారా చదవడం, రాయడం నేర్చుకున్న అక్షరాస్యులకు పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ అశ్రా పర్వీన్ జావిద్ పాల్గొని, అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు, కలములు అందించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అక్షరాస్యత ప్రతి ఒక్కరి హక్కు అని, ఇలాంటి కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌పి లావణ్య కూడా పాల్గొన్నారు.