navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 4:25 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : ఎంఈఓ కేతిరి దామోదర్ రెడ్డి

నవగీతం, మల్లాపూర్:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో మూడు పరీక్షా కేంద్రాలలో 436 మంది విద్యార్దులు రేపటి నుండి పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్ననారు.ఇట్టి పరీక్షల నిర్వహణకు ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్ లు ముగ్గురు డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు 30 మంది ఇన్విజిలేటర్లను, వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించి వారికి శుక్రవారం శిక్షణను నిర్వహించినట్లు మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో చీఫ్ సూపెరింటెండెంట్లు ఆకుల శ్రీనివాస్ , చంద్రమోహన్ రెడ్డి గట్టు శ్రీనివాస్ తో పాటు పరీక్ష సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు