navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 10:07 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: డా. రఘు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

కోరుట్ల నియోజకవర్గంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ముఖ్యమైన దశ అని అన్నారు. విద్యార్థులు భయం, ఆందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. ఇప్పటివరకు చేసిన కృషి, సాధనపై నమ్మకం ఉంచుకుని ప్రశాంతంగా పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ధైర్యం చెప్పి ప్రోత్సహించాలని కోరారు. నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులు, పాఠశాలలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.