navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 6:04 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పలు అభివృద్ధి పనులు పరిశీలన

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన  కలెక్టర్

నవగీతం, కొడిమ్యాల:

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ  భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలాన్ని సందర్శించారు.మండల కేంద్రంలో జరుగుతున్నపలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉదయం కోడిమ్యాల మండల కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, చిలుక వాగు, బస్ స్టాండ్ ప్రాంతం, అలాగేవివిధ గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు.

అనంతరం దమ్మయ్యపేట గ్రామానికి వెళ్లి గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం నాచుపెల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు విధానం, భోజనం నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ సత్యప్రసాద్, 99 రోజుల ప్రణాళికలో భాగంగా కోడిమ్యాల మండల కేంద్రం దమ్మయ్యపేట గ్రామంలో జరుగుతున్న పలు నిర్మాణ పనులను పరిశీలించినట్లు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలోనే ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించేందుకు స్వయంగా భోజనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి మదన్ మోహన్, జిల్లా హౌసింగ్ అధికారి ప్రసాద్, స్థానిక సర్పంచ్ జీవన్ రెడ్డి ఎంపీడీవో స్వరూప ఎమ్మార్వో కిరణ్ కుమార్ ఈఓ వంశి వర్ధన్ వివిధ సంస్థల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.