పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహించాలి.

హెల్త్ సబ్ సెంటర్, అంగన్‌వాడి, పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. నవగీతం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో పారిశుధ్య పరిస్థితులను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు మరియు ప్రజా ప్రదేశాల్లో నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమాలను పరిశీలించి, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. పట్టణ ప్రజలకు శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం...