పులి కలకలం… వరుస దాడులతో గ్రామస్తుల్లో భయం
నవగీతం,కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట గంగారం తండా పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గత రెండు రోజులుగా పులి పశువులపై వరుస దాడులు జరుపుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందు రోజే ఒక లేగదూడను పులి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఆ ఘటనలో బాధితుడికి అటవీ శాఖ అధికారులు తక్షణ సహాయంగా రూ.5,000 అందజేశారు. తదుపరి రోజు గంగారం తండాలోని సేవలాల్ గుడి సమీపంలో తేజావత్ గోరి అనే రైతుకు చెందిన సుడి ఆవుపై పులి...