navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 2:42 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పూర్వ విద్యార్థుల హోలీ సంబరాలు

నవగీతం, మెట్ పల్లి :

మెట్ పల్లి లో పదవ తరగతి (1992-93) బ్యాచ్ పూర్వ విద్యార్థులు మంగళవారం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ హొలీ పండగను పురస్కరించుకొని పదవ తరగతి (1992-93) బ్యాచ్ వారు తమ సన్నిహితులకు ఒకరినొకరు రంగులను చల్లుకుని ఆనందంలో మునిగితేలారు. ఆత్మీయ మిత్రులతో హోలీ పండుగ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో ఒకరినొకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అత్మీయ మిత్రులు పూర్వ విద్యార్థులు మహమ్మద్ ఆజీమ్ సుధాకర్  సంతోష్ వెంకటేష్  బద్రి వేణు భుమేశ్వర్ సత్యనారాయణ మహేష్  వేణుగోపాల్ అన్నం నాగరాజ్ ప్రవీణ్  ప్రసాద్  అలీ తదితరులు పాల్గొన్నారు.