పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి నేర సమీక్షలో సీపీ ఆదేశాలు

నవగీతం, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధ్యక్షతన కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు తమ పరిధిలోని పెండింగ్ కేసుల పురోగతిని వివరించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయడం, శాంతిభద్రతల పరిరక్షణపై విస్తృతంగా చర్చ జరిగింది. 2024 వరకు పెండింగ్‌లో ఉన్న కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్ర నేరాల స్థితిగతులను సమీక్షించారు. ముఖ్యంగా ఆస్తి నేరాలు, మహిళలపై దాడులు, పోక్సో చట్టం కింద కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని...