నవగీతం,మల్లాపూర్:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ దన్ పెన్షన్ పథకాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మెట్ పల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కృష్ణ సాగర్ పేర్కొన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని మీసేవ కేంద్రం వద్ద శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్మికులకు పథకాల గురించి వివరించారు. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల గల అన్ని రంగాల కార్మికులు ఇందుకు అర్హులని తెలిపారు. కార్మికునికి 60 సంవత్సరాల తర్వాత ప్రతినెల 3 వేల పెన్షన్ అందుతుందని తెలిపారు. పథకంలో చేరేవారు వారి వయస్సు 60 సంవత్సరాలు వచ్చేంతవరకు బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ ద్వారా చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సాంబారి శంకర్, గంప మనోహర్,చిప్ప రాజశేఖర్, రుద్ర రాంప్రసాద్, ఏగ్యారపు వెంకటేశ్వర్లు స్థానిక నాయకులు సిరిపురం రవీందర్, గుడేల్లి రాజాం,మోరపు గంగారాజం , పుప్పాల రాజా రెడ్డి, గజ్జెటీ నర్సాయ్య, నేవతే సత్యనారాయణ లేబర్ కార్డు కలిగిన కార్మికులు పాల్గొన్నారు.