పేదరికాన్ని జయించి ‘డాక్టరేట్’ సాధించిన తిర్మలాపూర్ బిడ్డ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఘన సన్మానం నవగీతం, కొడిమ్యాల: కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ గ్రామంలోని సామాన్య గీత కార్మికుడి కుటుంబంలో జన్మించి,ఆర్థిక ఇబ్బందులను అధిగమించి విద్యా రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నేరెళ్ల శైలజ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్ర విభాగంలో ఆమె 'డాక్టరేట్' పట్టా సాధించిన సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు.ప్రభుత్వ విద్యతోనే ఉన్నత శిఖరాలకు..నేరెళ్ల సాయగౌడ్ కుమార్తె అయిన శైలజ, తన ప్రాథమిక విద్య...