navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 3:06 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పోలీస్ ప్రధాన కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్  స్వర్గీయ దుద్దిల్ల  శ్రీపాద రావు జయంతిని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు.

నైతిక విలువలు, ప్రజల పట్ల అంకితభావం కలిగిన ప్రజానాయకుడిగా ఆయన గుర్తింపుపొందారని ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ యొక్క కార్యక్రమంలో ఎస్బి డిఎస్పి వెంకటరమణ,రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, వేణు, సైదులు, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రవీందర్, శ్రీధర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.