navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 7:20 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

 ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో ఫ్రైడే డ్రైడే

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధి లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగం గా ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. దోమల నియంత్రణకు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ పాటించాలని, ఇళ్లలో, పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి, దోమల సంతానోత్పత్తిని అరికట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వ్యాప్తిని అరికట్టవచ్చు,ప్రతి శుక్రవారం ఇళ్లలో ఉన్న కూలర్లు, ట్యాంకులు, పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి బోండాలు, ఇతర పాత్రలలో నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేసి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి,కార్యదర్శి శ్రీనివాస్,బిల్ కలెక్టర్ జగన్ వార్డు సభ్యులు ముష్కరి రమేష్, ఎం.డీ షబ్బీర్,అరికుప్పల రాజం, అంగన్వాడీ కార్యకర్తలు ఇందిర, వసంత, రాధ, గంగా భవాని, వసంత, జయ,జీవన్ నాయక్, కాశవతుల లక్ష్మి, ఏ.వి.ఆర్ తదితరులు పాల్గొన్నారు.