ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని జగిత్యాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్  ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్యంగా పట్టణ పరిశుభ్రత  అంశంపై చర్చించారు. పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచి, ప్రజలకు శుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను...