navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 8:34 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రతి జిల్లాకు ఓక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ప్రతి జిల్లా కు ఓక వెల్నెస్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరబూజ రవీందర్ అన్నారు. శనివారం స్థానిక పెన్షనర్స్ భవన్ లో జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి కొలిచాల రవీందర్ ల సారథ్యంలో జరుగగా ఇందులో కార్యదర్శి తన నివేదికను ప్రవేశ పెట్టారు. అనంతరం పలు తీర్మానాలను ఆమోదించారు. ఫిబ్రవరి 2026 నాటికి పదవి విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ఏక మొత్తంగా చెల్లించాలన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీం ను స్వయం ప్రతి పత్తి గల సంస్థ కు అప్పగించాలని కోరారు. ప్రతి జిల్లాకు ఒక వెల్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. రాష్ట్ర సంఘములో జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఎల్లా గంగరాజంను జిల్లా సంఘం పక్షాన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు మెట్ట మల్లిఖార్జున్, కంటే అంజయ్య తోపాటు కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి, మల్యాల, కొడిమ్యాల యూనిట్స్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే ఆర్థిక కార్యదర్శి గుండేటి గంగాధర్, జిల్లా బాద్యులు ఎన్నమనేని అశోక్ రావు, సిరికొండ గంగారాం, దత్తాత్రేయ, ప్రభు, కనక తార, పద్మావతి, సుధాకర్ రావు, చంద్రశేఖర్, మధు సుధన్ లు పాల్గొన్నారు.