ప్రతి జిల్లాకు ఓక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రతి జిల్లా కు ఓక వెల్నెస్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరబూజ రవీందర్ అన్నారు. శనివారం స్థానిక పెన్షనర్స్ భవన్ లో జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి కొలిచాల రవీందర్ ల సారథ్యంలో జరుగగా ఇందులో కార్యదర్శి తన నివేదికను ప్రవేశ పెట్టారు. అనంతరం పలు...