ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన స్కానింగ్ కేంద్రం ప్రారంభం
నవగీతం, మెట్ పల్లి టౌన్: మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రాలను కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యుడు కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో మహిళల ఆరోగ్య రక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వైద్యశాలల్లోనే అత్యాధునిక సదుపాయాలను అందుబాటులోకి...