నవగీతం, మెట్ పల్లి :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో గురువారం రోజున స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు అధికంగా చేయాలని కోరుతూ ఆ కళాశాల కరపత్రాన్ని సదరు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య ఆధ్వర్యంలో కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, 2026-2027 విద్యా సంవత్సరంలో విద్యార్థులు కళాశాలలో అధిక సంఖ్యలో అడ్మిషన్లు తీసుకోవాలని, అందుకోసం కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటేనే కళాశాల దినదినాభివృద్ధి చెందుతుందని, అందుకోసం కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బందిపై ఆధారపడి ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య స్పష్టంగా పేర్కొన్నారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న మాట్లాడుతూ, కళాశాల అభివృద్ధి కోసం తమ సహాయ సహకారాలను ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మనోజ్ కుమార్, లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్, సత్య శోధన్ లతోపాటు బోధనేతర సిబ్బంది లక్ష్మినారాయణ, బాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.