ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకారం అందించాలి

విడిసి ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ప్రారంభం నవగీతం, మల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకారం అందించాలని ప్రధానోపాధ్యాయులు వేణు అన్నారు. బుధవారం మల్లాపూర్ మండలంలోని పాతదాంరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.17 వేల విలువ గల ఫ్యూరీ ఫైడ్ వాటర్ ఫిల్టర్ ను వీడీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు దాతలు అన్నిరకాల సంపూర్ణ సహాయ సహకారాలు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు శుద్ధమైన త్రాగు నీరు...