navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 10:51 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

నవగీతం, కొడిమ్యాల:

టీయూడబ్ల్యూజేఐజేయూ 143 యూనియన్ కొడిమ్యాల మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది.రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ, టెంజు అధ్యక్షులు అంజుగౌడ్ మార్గదర్శకత్వంలో ఈ నియామకాలు చేపట్టినట్లు గంగాధర్ తెలిపారు.గౌరవ అధ్యక్షుడిగా పైడిపల్లి సతీష్ రావు, అధ్యక్షుడిగా చొక్కాల మహిపాల్, ఉపాధ్యక్షులుగా చెన్న దేవేందర్, కొండూరి సురేష్, ప్రధాన కార్యదర్శిగా దీకొండ చంద్రశేఖర్, కోశాధికారిగా బోగ సూర్యతేజ ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా అడ్లగట్ట గంగాధర్, కొల్లూరి రవీందర్, గుండు శేఖర్, ఎండి రఫీ, మొగిలిపాలెం శ్రీనివాస్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్ మరియు అధ్యక్షుడు చొక్కాల మహిపాల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, యూనియన్ బలోపేతం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను తోటి జర్నలిస్టులు అభినందించారు.