navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 9:35 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

బీసీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం, మెట్ పల్లి టౌన్:

మెట్‌పల్లి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లను  పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది, భోజనశాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులదని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, హాజరు శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాలలో ఎలాంటి లోపాలు ఉండకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో ఎస్సీ వెల్ఫేర్ రాజకుమార్,విద్యాశాఖ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు