బీసీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం, మెట్ పల్లి టౌన్: మెట్‌పల్లి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లను  పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది, భోజనశాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత...