navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 6:26 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

బుగ్గారం ఇంచార్జి ఎంపిడివో గా వాసవి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల ఇంచార్జి ఎంపిడివో గా వాసవి మంగళ వారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎంపిడివో సుమంత్ 45 రోజుల శిక్షణ కు వెళ్లిన సందర్భంగా బుగ్గారం ఇంచార్జి ఎంపివో గా పని చేస్తున్న వాసవి కి అదనంగా ఎంపిడివో బాధ్యతలు కూడా అప్పగిస్తూ ఈ నెల 7న ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అట్టి ఉత్తర్వుల ప్రకారం మంగళ వారం ఆమె ఇంచార్జి ఎంపిడివో గా బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. మండలంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోయి మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు కూడా మండలంలోని అన్ని గ్రామాలలో విజయ వంతం అయ్యేలా చూస్తానని తెలిపారు.