బోర్డు పరీక్షలపై విద్యార్థులకు ఉపాధ్యాయుల దిశానిర్దేశం
విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నుల పంపిణీ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు పదో తరగతే తొలిమెట్టు అని, ఇక్కడ వేసుకునే పునాదే ఉన్నత చదువులకు బాటలు వేస్తుందని 6వ వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి అన్నారు. కోరుట్ల పట్టణం 6వ వార్డు ఏకీన్‌పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువును భయంతో కాకుండా ఇష్టపడి...