navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 2:59 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలి..కలెక్టర్, ఎస్పీ

నవగీతం,జగిత్యాల ప్రతినిధి

కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్ల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యంగా భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టెంపుల్ ఈవో, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డిఎస్పి రఘు చందర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు