భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి..కలెక్టర్ సత్య ప్రసాద్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 01 నుండి 03 వ,తేది వరకు జరగనున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.సోమవారం రోజున కొండగట్టు ఆలయ పరిసరాల్లో నిర్వహించనున్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను ప్రత్యక్షంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ...