navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 12:25 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న కొండగట్టు నూతన ఈఓ

నవగీతం,రాజన్న సిరిసిల్ల:

భీమేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈఓ అంజనా రెడ్డి.శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈఓ ఎస్. అంజనా రెడ్డి. గురువారం ఉదయం కొండగట్టులో బాధ్యతలు స్వీకరించిన అనంతరం, భీమేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మండపంలో వారికి ఆలయ ఈఓ ఎల్. రమాదేవి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.