navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 6:24 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మల్లన్న జాతర ఉత్సవాలకు ఆహ్వానం

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేంద్రం లో శనివారం నుండి ఐదు రోజుల వరకు మల్లాపూర్ లోని మల్లన్న స్వామి ఆలయం లో జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి అని దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంగ రాజం యాదవ్ మల్లాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం ను ఆహ్వానించారు. మంగళవారం రోజు అన్నదానం కార్యక్రమం కలదు అని అన్నారు.జాతర ఉత్సవాలు విజయవంతం చేయుటకు సహకరిస్తామని మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు భుక్యా శేఖర్,ముష్కరి రమేష్, ముత్యాల గంగా రాజం, ఎండి షబ్బీర్ అల్లె చంద్రయ్య, ఏనుగంటి నరేశ్, శనిగరపు నరేష్,డాక్టర్ రాజ గంగారాం, అరికంటి గంగ మల్లయ్య, వేల్పుల రాజం, ఏ.వీ.ఆర్ తదితరులు పాల్గొన్నారు.