navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 10:22 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలందిస్తాం

వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ కాపా చంద్రకళ

నవగీతం, వైరా:

మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ కాపా చంద్రకళ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైరా మండలంలోని విప్పలమడక గ్రామ పంచాయితీ కార్యాలయంలో మహిళా గ్రామ సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడా హేమీమా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సభలో కాపా చంద్రకళ ప్రసంగించారు. మహిళలు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారని కొనియాడారు. కుటుంబాన్ని చక్కబెట్టటంలో మహిళల పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విప్పలమడక గ్రామ పంచాయితీ 15 రోజుల్లోపు ఫ్రీజర్ బాక్స్ ను  వితరణగా ఇస్తామని ఆమె స్పష్టం చేశారు.

ఈ గ్రామంలో తమ క్లబ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం చైర్ పర్సన్ కాపా చంద్రకళ, 20వ వార్డు కౌన్సిలర్  ఉండ్రు వరలక్ష్మిలకు గ్రామ సర్పంచ్ మేడా హెమీమా చక్రపాణి, ఉపసర్పంచ్ బూర్గు లూర్ధమ్మ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ముందుగా చైర్ పర్సన్ కు గ్రామ మహిళలు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో కాపా చంద్రకళ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి,  ఉపసర్పంచ్ బూర్గు లూర్ధమ్మ, లయన్స్ క్లబ్ జిల్లా విజన్ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు, న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల డైరెక్టర్  డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, మాజీ సర్పంచులు పారుపల్లి కృష్ణారావు తుమ్మల జాను పాపయ్య, మాజీ ఎంపీటీసీ ఆకుల ప్రసాద్, మాజీ ఉపసర్పంచ్లు వీరపనేని చెన్నకేశవరావు, కొలికొండ వీరభద్రరావు, గ్రామ కార్యదర్శి కాంపెల్లి ధనమ్మ, వార్డు సభ్యులు ముత్తమాల నాగజ్యోతి, పారుపల్లి నిఖిత, ముత్తమాల దేవానందం, గరిడేపల్లి శ్రీనివాసరావు, సత్తెనపల్లి మాధవి, ముత్తమాల వెంకటరత్నం, కాశిమాల సామేలు, తేళ్ళురి వెంకటయ్య, బూర్గు నందిని, ఏఎన్ఎం వసంత రాణి  తదితరులు పాల్గొన్నారు.