మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలందిస్తాం వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ కాపా చంద్రకళ నవగీతం, వైరా: మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ కాపా చంద్రకళ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైరా మండలంలోని విప్పలమడక గ్రామ పంచాయితీ కార్యాలయంలో మహిళా గ్రామ సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడా హేమీమా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సభలో కాపా చంద్రకళ ప్రసంగించారు. మహిళలు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారని కొనియాడారు. కుటుంబాన్ని చక్కబెట్టటంలో...