మహిళా సంఘా భవనాల నిర్మాణానికి భూమి పూజ

నవగీతం, చొప్పదండి: చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో స్వశక్తి మహిళా సంఘాల నూతన భవనాల నిర్మాణానికి స్థానిక నాయకులు మహిళలతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని వారిని గౌరవించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, రుక్మాపూర్ సర్పంచ్ కర్రె ప్రేమలత శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్,...