navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 6:46 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మహిళా సంఘ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామంలో రూ.10 లక్షల నిధులతో మహిళా సంఘం భవన నిర్మాణానికి సోమవారం నాడు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వారి ఇంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోడిసెల గంగాధర్, ఉప సర్పంచ్ ఊరేడి గంగాధర్ ,మండల నాయకులు కొలుగోరి దామోదర్ రావు, బాలముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, రౌతు గంగాధర్, ఆలయ కమిటీ చైర్మన్ పోగుల నారాయణ, ఎంపీఓ వాసవి, ఏఈ విజయ్ ,ఆర్ ఐ నరేందర్, ఏపిఎం రాజయ్య ,సిసి సురేశ్,మహిళా సంఘం అధ్యక్షురాలు కళావతి,గ్రామ ప్రజలు,మహిళలు పాల్గొన్నారు.