మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నల్లాల లక్ష్మీరాజం ఆకస్మిక మరణం జిల్లా పోలీస్ శాఖకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.విధి నిర్వహణలోనే కాకుండా, మరణానంతరం కూడా తన అవయవాలను దానం చేసి మరో ఇద్దరికి ప్రాణదాతగా నిలిచిన ఆయన, పోలీస్ అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు, మానవత్వానికి ప్రతీక అని మరోసారి చాటిచెప్పారు.ఇలాంటి దుఃఖ సమయంలో కూడా ఆయన భార్య శ్రీమతి రాధ చూపిన ధైర్యం, తీసుకున్న గొప్ప నిర్ణయం సమాజానికి ఆదర్శప్రాయంగా...