navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 9:04 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మార్కెట్ స్థలాల రక్షణకు గొర్రెల కాపరుల సన్నద్ధం

ఈ నెల 10న చర్చా వేదికను విజయవంతం చేయండి

సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్

నవగీతం, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొర్రెలు,మేకల మార్కెట్ యార్డ్‌లో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మన మార్కెట్ స్థలాలు-మనమే కాపాడుకుందాం అనే నినాదంతో జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్,జిల్లా అధ్యక్షులు సలేంద్ర రాములు యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.మార్కెట్ స్థలాల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా సాగే ఈ చర్చా వేదికకు జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు,సంఘం ప్రతినిధులు మరియు గొర్రెల కాపరులు భారీ సంఖ్యలో తరలివచ్చి,తమ అమూల్యమైన సూచనలు మరియు అభిప్రాయాలను పంచుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు.