మార్కెట్ స్థలాల రక్షణకు గొర్రెల కాపరుల సన్నద్ధం
ఈ నెల 10న చర్చా వేదికను విజయవంతం చేయండి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ నవగీతం, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొర్రెలు,మేకల మార్కెట్ యార్డ్‌లో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మన మార్కెట్ స్థలాలు-మనమే కాపాడుకుందాం అనే నినాదంతో జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి...