నవగీతం, ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ లో మాస్టర్ కాన్వెంట్ స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులు ముందస్తు హొలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సాత్పడి పురుషోత్తం మాట్లాడుతూ వసంత ఋతువు ఆగమనాన్ని తెలిపేది హొలీ పండుగ అని సహజ సిద్ధమైన రంగులనే వాడాలని హాని కరమైన రసాయనలతో చేసిన రంగులు వాడద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాత్పాడి పురుషోత్తం మరియు టీచర్లు పావని, స్వప్న, దివ్య, కీర్తన, మాధురి పాల్గొన్నారు.
