నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
మెట్‌పల్లి పట్టణంలో ఆదివారం సాయంత్రం విశ్వశాంతి కోసం ఆధ్యాత్మిక వాతావరణం లో ఇస్కాన్ మెట్‌పల్లి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సాయికృష్ణ టాకీస్ వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమం పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మార్గంగా మళ్లీ పాత బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారి గుండా సాగి డిపో వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు భజనలు, కీర్తనలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు. విశ్వశాంతి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వంతు బాధ్యతగా భాగస్వామ్యం అయ్యారు. హరే కృష్ణ, హరే రామ నామస్మరణలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. కాగా ఈ కార్యక్రమం మెట్‌పల్లి పట్టణంలో విశేషంగా ఆకట్టుకుని, భక్తి భావాన్ని మరింత పెంపొందించింది.
