మెట్‌పల్లిలో విశ్వశాంతి కోసం హరినామ సంకీర్తన
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మెట్‌పల్లి పట్టణంలో ఆదివారం సాయంత్రం విశ్వశాంతి కోసం ఆధ్యాత్మిక వాతావరణం లో ఇస్కాన్ మెట్‌పల్లి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సాయికృష్ణ టాకీస్ వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమం పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మార్గంగా మళ్లీ పాత బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారి గుండా సాగి డిపో వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు భజనలు, కీర్తనలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు. విశ్వశాంతి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో...