navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 6:52 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మెట్‌పల్లి పట్టణ స్లమ్ సమాఖ్యకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

స్త్రీనిధి 13వ సర్వసభ్య సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించగా 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యాపార నిర్వహణ, రుణాల తిరిగి చెల్లింపులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పట్టణ సమాఖ్యగా రాష్ట్రవ్యాప్తంగా మెట్‌పల్లి పట్టణ స్లమ్ సమాఖ్య (మెట్‌పల్లి పురపాలక సంఘం) ఎంపిక కావడం విశేషం. ఈ అవార్డును హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క, సంబంధిత అధికారుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మెప్మ సహాయ అధికారి శ్రీనివాస్ గౌడ్, పట్టణ మిషన్ సమన్వయకర్త సోమిడి శివ కుమార్, సమాఖ్య అధ్యక్షురాలు బబ్బూరి లక్ష్మి, స్త్రీనిధి నిర్వాహకురాలు గంగాజల అవార్డును స్వీకరించారు. ఈ విజయంతో మెట్‌పల్లి పట్టణ సమాఖ్య రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందని అధికారులు తెలిపారు.