navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 7:50 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మెప్మా ఆర్పీలకు సత్కారం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ ఆధ్వర్యంలో వార్డులోని మహిళా సంఘాల ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు శాలువాలు కప్పి సన్మానించారు. అదేవిధంగా వారిని ఇంటి ఆడబిడ్డలుగా భావించి చీరలు పెట్టి గౌరవించారు. ఈ సందర్భంగా అరిగెల అనూష-రాకేష్ లు మాట్లాడుతూ వార్డులోని మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం మీరు అందిస్తున్న సేవలు అభినందనీయమని, ఈ సేవలు అలాగే కొనసాగాలని, వార్డు అభివృద్ధిలో తమతో పాటు భాగస్వాములు కావాలని కోరారు. అదేవిధంగా మహిళలు అన్నిరంగాల్లో ముందుకు వెళ్ళాలని, మహిళల అభ్యున్నతికి తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు. తమ సహయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, మహిళా దినోత్సవ సందర్భంగా తమ సేవలను గుర్తించి తమను సన్మానించినడం సంతోషంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్, వివిధ మహిళా సంఘాల ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.