మెప్మా ఆర్పీలకు సత్కారం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ ఆధ్వర్యంలో వార్డులోని మహిళా సంఘాల ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు శాలువాలు కప్పి సన్మానించారు. అదేవిధంగా వారిని ఇంటి ఆడబిడ్డలుగా భావించి చీరలు పెట్టి గౌరవించారు. ఈ సందర్భంగా అరిగెల అనూష-రాకేష్ లు మాట్లాడుతూ వార్డులోని మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం మీరు అందిస్తున్న సేవలు అభినందనీయమని, ఈ సేవలు అలాగే కొనసాగాలని, వార్డు అభివృద్ధిలో తమతో పాటు భాగస్వాములు కావాలని కోరారు....