రక్తదానం చేసి ప్రాణం నిలిపిన హనుమాన్ దీక్ష స్వామి
నవగీతం, మెట్ పల్లి టౌన్: మెట్ పల్లి పట్టణంలో మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా ఒక యువకుడు అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడారు.మెట్ పల్లి పట్టణంలోని తిరుమల నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న లక్ష్మీ అనే మహిళకు అత్యవసర చికిత్స కోసం 'ఏ' పాజిటివ్ రక్తం అవసరమైంది. దీంతో పేషెంట్ కుటుంబ సభ్యులు రక్తదాత కోసం వెతుకుతూ రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్ ను సంప్రదించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న ఆక్టివ్ బ్లడ్ డోనర్ కర్నాల గౌతమ్ స్వామికి సమాచారం అందించగా,...