navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 3:52 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రమాదేవి కులకర్ణి కథల సంపుటి గగ్గమ్మ పుస్తకావిష్కరణ.

నవగీతం,హైదరాబాద్:

హైదరాబాద్ కూకట్ పల్లి పుచ్చల పల్లి సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో తపస్వి మనోహరం అంతర్జాల మాస, వార పత్రిక, పబ్లికేషన్స్ సంస్థ,5వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈసందర్బంగా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి వ్యక్తిత్వ, వికాస నిపుణులు, తపస్వి మనోహరిలో “కాసేపు నాతో “శీర్షిక కాలమిస్ట్, రమాదేవి కులకర్ణి కథల సంపుటి “గగ్గమ్మ” పుస్తకావిష్కరణ ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, చంద్రప్రతాప్, కంతేటి, ప్రముఖ కవి, నటులు, సినీ గేయ రచయిత,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణ నంది,ఉగాది పురస్కార గ్రహీత, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయ బంగారు పతక విజేతశ్రీ సాదనాల వెంకట స్వామీ నాయుడు,ప్రముఖ నవలా రచయిత, కథ, నవల, రేడియో, బుల్లితెర, సినిమా రచయిత, నటుడు, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, కళా రత్న, నంది అవార్డుల గ్రహీత శ్రీ పి. చంద్రశేఖర ఆజాద్,తపస్వి సంస్థ సిఈఓ నిమ్మగడ్డ అవినాష్ కార్తిక్, డైరెక్టర్స్ అఖిల, బుజ్జమ్మ, విజయ పాల్గొన్నారు.రచయిత్రి వివిధ పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్న ఇరవై రెండు కథల సమాహారమే గగ్గమ్మ అని విశ్లేషించారు.ఈ కార్యక్రమంలో కవులు కళా కారులు తదితరులు పాల్గొన్నారు.