navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 11:50 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రాష్ట్రస్థాయి యం.యూ.ఎన్ సమావేశనికి విద్యార్థి అనన్య ఎంపిక

నవగీతం, సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా సింగన్నగూడ జడ్పీ హైస్కూల్ కి చెందిన విద్యార్థిని అనన్య రాష్ట్ర స్థాయిలో జరిగే మోడల్ ఐక్యరాజ్యసమితి, సమావేశానికి ఎంపిక కావడం పాఠశాలకు మరియు గ్రామానికి గర్వకారణంగా ఉందని హెడ్ మాస్టర్ రహీమ్ అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఆమె ప్రతిభ నాయకత్వ లక్షణాలు అంతర్జాతీయ అంశాలపై ఉన్న అవగాహనకు మోడల్ ఐక్య రాజ్య సమితిలో పాల్గొనడం నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రపంచ దేశాల ప్రతినిధులుగా పాల్గొని అంతర్జాతీయ సమస్యలపై చర్చలు వాదనలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో నాయకత్వం, కమ్యూనికేషన్, నైపుణ్యం ప్రపంచ అవగాహన పెరుగుతుందని,

విద్యార్థిని అనన్య రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడానికి కృషిచేసిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు డా.దేవులపల్లి పర్షరాములు,కృషి ఎంతో ఉందిని హెడ్ మాస్టర్ మొహమ్మద్ రహీమ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,మనోహర్ రెడ్డి,సవిత ఆంజని విద్యార్థిని అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.