navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 4:31 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు సన్మానం

నవగీతం,మల్లాపూర్ :

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన క్రీడాకారులు సిఎం కప్ ఫుట్ బాల్ ఆటలో రాష్ట్ర స్థాయిలో పాల్గోన్న బోదసు హారీష్, బోదసు రాము ,దండుగుల మమత, పల్లపు సిందుర కి చిట్టాపూర్ వడ్డె ఓబన్న కమీటి సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ వారు క్రీడల్లో ఇంకా ముందుకు వెళ్లాలని వారికి ఏ అవసరాలు ఉన్న సహాయం కావాలన్నా మేము అండగా ఉంటామని వారికి ఎప్పుడు తోడుగ వడ్డె ఓబన్న కమీటి ఉంటుందని తెలిపారు.ఇంతటి స్థాయికి వెల్లెల చేసిన పియిటి వినోద్ కి ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దండుగుల అంజిరాజ్,దండుగుల గంగారం, పల్లపు రాజనర్సయ్య,పల్లపు నరేష్,దండుగుల గంగధర్,మక్కల బుచ్చన్న,సూర ప్రవీణ్,బోదసు బీమయ్య, బోదసు అంజయ్య, అల్లేపు నర్సయ్య తదితిరుల పాల్గోన్నారు.